రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై గుంతలు.. నాలుగేళ్లకే బయటపడ్డ నాణ్యతా లోపం

by Dishanational2 |
రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై గుంతలు.. నాలుగేళ్లకే బయటపడ్డ నాణ్యతా లోపం
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: దశాబ్దాల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారమైన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్(ఆర్ఓబి) పై గుంతలు పడి నాలుగేళ్లకే నిర్మాణంలోని నాణ్యతా లోపాలు బయట పడుతున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో రైల్వే గేట్ సమస్య జంట గ్రామాల స్థానికులతో పాటు వివిధ మండలాలు, జిల్లాలకు వెళ్లే రాకపోకలకు దశాబ్దాల సమస్య గా ఉండేది. అనేక విజ్ఞప్తులు, ఆందోళనల పుణ్యమా అని రూ. 3.50 కోట్ల వ్యయంతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించి సెప్టెంబర్ 5, 2018 న ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జి ప్రారంభంలో గుంతలు పడగా బ్రిడ్జి స్లాబ్‌ల జాయింట్ల వద్ద గండ్లు పడి రాడ్లు తేలి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ప్రయాణం ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి దెబ్బతిన్న రైల్వే బ్రిడ్జి పై మరమత్తు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.


Next Story

Most Viewed