పోలీస్ స్టేషన్లలో ప్రీ రిజిస్ట్రేషన్ జరగాలి: వరంగల్ కమిషనర్ ఏ.వి రంగనాథ్

by Disha Web Desk 12 |
పోలీస్ స్టేషన్లలో ప్రీ రిజిస్ట్రేషన్ జరగాలి: వరంగల్ కమిషనర్ ఏ.వి రంగనాథ్
X

దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ స్టేషన్‌లో ప్రజలు చేసే న్యాయపరమైన ఫిర్యాదులపై తక్షణమే కేసు నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం లోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు.

డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్స్పెక్టర్లు, సబ్-ఇన్సెస్పెక్టర్లు పాల్గోన్నారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ అధికారులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌ల వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతో పాటు, చట్టపరంగాను, న్యాయపరమైన ఫిర్యాదులపై అధికారులు కేసుల నమోదు చేయడం ద్వారా ఫిర్యాదులకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు.

అలాగే రానున్న రోజుల్లో గతంలో కన్నా 50 శాతం నుండి నూరు శాతం అధికంగా పోలీస్ స్టేషన్లలో ఫ్రీ రిజిస్ట్రేషన్ జరగాలని, ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలతో పాటు, భూ కబ్జాలు, తీవ్రంగా కొట్టిన కేసులు, రౌడీయిజం పై వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు తక్షణమే స్పందించి కేసులను నమోదు చేయాలని, కొన్ని సందర్భాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే ప్రజలకు న్యాయం చేయలేమని అధికారులు చట్టపరంగా విధులను నిర్వహిస్తునే, స్పష్టమైన, కఠినమైన, నిర్ణయాలను తీసుకోవాల్సి వుంటుందని. ముఖ్యంగా అధికారులు ఒక సమస్యను పరిష్కరించకుంటే వంద సమస్యలు మీ ముందువుంటాయని, వ్యక్తిగత క్రమ శిక్షణతో ఉంటూ.. నిబద్దతతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

శాంతి భద్రతల అంశాలపై ప్రస్తావిస్తూ.. ఆస్తి దొంగతనం కేసులకు సంబంధించి అధికారులు ఇకపై జరిగిన పూర్తి ఆస్తి నష్టం వివరాలను కేసు వివరాల్లో పొందుపర్చాలని, దొంగతనాలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతో పాటు, నాన్-బెయిల్ వారెంట్లు, సైబర్ క్రైం నిందితులను పట్టుకోవడం కోసం డివిజన్ల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ఈ బృందాలు లా అండ్ ఆర్డర్, సీసీఎస్ పోలీసులతో సమన్వయ పరచుకుంటూ నిందితులను పట్టుకోవాల్సి వుంటుందన్నారు. ముఖ్యంగా ఏవరైన ఎలాంటి నేరానికి పాల్పడిన వారిపై రికార్డు పరంగా కేసులను నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో వారు ఎలాంటి నేరానికి పాల్పడిన పి డి యాక్ట్ క్రింద కేసులను నమోదు చేయడం సులభం అవుతుందని తెలిపారు.

మిస్సింగ్ కేసుల్లోని వ్యక్తులను గుర్తించేందుకు గాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయబడుతుందని, స్టేషన్ అధికారులు నమోదయిన ప్రతి కేసులోని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుసరించాలని, అలాగే డీసీపీలు, ఎసీపీలు, సర్కిల్ ఇన్సెస్పెక్టర్లు తమ పరిధిలో నమోదయిన కేసులను ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలన్నారు. భూ కబ్జా కేసుల్లో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా, మార్ఫింగ్ చేసిన వాహనదారులపై చీటింగ్ కేసులను నమోదు చేయడంతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వాహన దారుల వాహనాలను సీజ్ చేసి మైనర్ డ్రైవర్లు, వాహన యజమానులపై చార్జ్ షీట్ వేయాలని సూచించారు. అలాగే నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఆటోలపై చెక్ రి పోర్టులను రాసి రోడ్డు రవాణా శాఖకు అప్పగించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో డిసిపిలు వెంకటలక్ష్మి, సీతారాం, అదనపు డిసిపిలు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, సురేష్ కుమార్ తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed