- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశమంతా రావణ దహనం చేస్తుంటే.. అక్కడ మాత్రం ఊరేగించి పూజలు.. ఎందుకిలా..?
దిశ, వరంగల్ టౌన్: దసరా అనగానే అందరికీ రావణ దహనం గుర్తుకొస్తుంది. ఏటా విజయదశమిని పురస్కరించుకుని రావణాసురుడి ప్రతిమలను దహనం చేస్తుంటారు. చెడుపై గెలుపునకు సూచికగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఓ వేడుకగా నిర్వహిస్తారు. కానీ, మహారాష్ట్రలోని కొడిశెలగూడెం గ్రామంలో మాత్రం రావణుడిని బ్రహ్మజ్ఞానిగా ఆరాధిస్తారు. దసరా రోజున రావణుడి విగ్రహానికి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా దసరా రోజున ఆ గ్రామంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీలంక నుంచి బౌద్ధగురు హాజరు కాగా, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి త్రైత జ్ఞానులు అధిక సంఖ్యలో పాల్గొని రావణుడిని స్మరిస్తూ జేజేలు కొట్టారు. అందులో ప్రత్యేకమైన నినాదాలు వినిపించాయి. అవి జనక మహారాజుకు గురువు అయిన రావణునికి జై, సీతకు తండ్రియైన రావణునికి జై, ద్వాదశ గ్రహాలను (ప్రకృతి)ని శాసించిన శాసనకర్త ఐన రావణునికి జై, త్రికాల జ్ఞాని అంటూ ప్రత్యేక నినాదాలు వినిపించడం గమనార్హం.