కేయూ విద్యార్థులు తలపెట్టిన బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

by Disha Web Desk 12 |
కేయూ విద్యార్థులు తలపెట్టిన బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
X

దిశ, కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లో పిహెచ్‌డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకల మీద నిరసన తెలిపిన విద్యార్థి నాయకులపై జరిగిన అమానుష దాడిని నిరసిస్తూ వరంగల్ జిల్లా బంద్ కు విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్ కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే మంగళవారం ఉదయం విద్యార్థి సంఘాలు చేపట్టిన బైక్ ర్యాలీని బయలు దేరిన క్రమంలో కే యూ డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద బైక్ లపై వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలను విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్ లో జరిగిన అవకతవకల మీద సమగ్రంగా తిరిగి విచారణ చేపట్టాలని ప్రజాస్వామ్యబద్ధంగా కోరిన నేపథ్యంలో విద్యార్థి నాయకుల పై దురుసుగా ప్రవర్తించి వారిపై పోలీసు కేసులు నమోదు చేసి వారిని టాస్క్ ఫోర్స్ కప్పగించి వాళ్ళు కాళ్లు చేతులు విరగొట్టిన ఘటనకు నిరసనగా నేడు పిలుపునిచ్చిన బంద్ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.

ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. ఘటనైన మరుసటి రోజు నుంచి నిరసన తెలుపుతూ.. ఎస్‌డీఎల్‌సి ఈ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా శిబిరంలోని నాయకులను ఇంతవరకు ఒక్కరు కూడా అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రులు, ఎటువంటి జ్యుడిషియల్ వ్యవస్థలు కూడా పరామర్శించలేదని, విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరూ కూడా విచారం తెలప లేదన్నారు. ప్రతి విషయానికి పోలీసులను థర్డ్ డిగ్రీతో ఇన్వాల్వ్ చేస్తూ.. సమస్యను మరింత జటిలం చేస్తున్నారని తెలిపారు. అవకాశం దొరికితే వీసీ, రిజిస్టర్ వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని వారి సూచనల మేరకు వైస్ ఛాన్సలర్ ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.

వీసీ తలపెట్టిన విద్యార్థి వ్యతిరేక చర్యలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్దామని బందుకు పిలుపునిస్తే దీన్ని కూడా ఉద్రిక్తత పెరిగేలా పోలీసులను మోహరింపజేసి సామాన్యుల హక్కులను పూర్తిగా హరించి వేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. కేయూలో వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ పాల్పడుతున్న దుశ్చర్యలకు నిరసనగా తాము శాంతియుతంగా బంద్‌కు పిలుపునిచ్చామని వీసీ తాటికొండ రమేష్, రిజిస్టర్ శ్రీనివాసరావును వెంటనే బర్తరఫ్ చేయాలని విద్యార్థి జేఏసీ నాయకులు తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు. వీసీని రిజిస్టర్ ను తక్షణమే భర్తరఫ్ చేయకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు.



Next Story

Most Viewed