ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోలీస్ కంప్లైంట్

by Web Desk |
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోలీస్ కంప్లైంట్
X

దిశ, పర్వతగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యాంగంపై చేసిన కామెంట్లను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొత్త రాజ్యాంగం రాసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు శనివారం సీఎం కేసీఆర్‌పై పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్, పర్వతగిరి ఎంపీటీసీ బోట్ల మహేంద్ర, పర్వతగిరి పట్టణ అధ్యక్షులు కుసం రామచంద్ర, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాధవరావు, కంటెం సుధాకర్, మల్లికార్జున్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు నరెడ్ల సంతోష్, రంజిత్, లోకేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed