కాంగ్రెస్ కార్పొరేట‌ర్‌కు షాక్.. ఆ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు

by Disha Web Desk 7 |
కాంగ్రెస్ కార్పొరేట‌ర్‌కు షాక్.. ఆ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : కాజీపేట సోమిడి ప్రాంతంలో ఐదు గుంటల భూమి ఆక్రమ‌ణ కేసులో 62 డివిజ‌న్ కార్పోరేట‌ర్ జ‌క్కుల ర‌వీంద‌ర్‌ను పోలీసులు అరెస్టు చేసి.. ప‌ర‌కాల జైలుకు రిమాండ్‌కు పంపించారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించ‌గా, పరకాల స‌బ్ జైలుకు తరలించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్‌పై ఇటీవ‌ల మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విష‌యం విదిత‌మే. కొద్దిరోజుల క్రితం భూ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విచార‌ణ జ‌రిపారు.

ఈ విచార‌ణ‌లో కార్పొరేటర్ జక్కుల రవీందర్ భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో ఆయ‌న‌పై కేసు నమోదు చేశారు. కొద్ది రోజులుగా ప‌రారీలో ఉన్న ర‌వీంద‌ర్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌ర్చారు. జిల్లా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘ‌ట‌న గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలో క‌ల‌క‌లంరేపింది. భూ ఆక్రమ‌ణ‌కు య‌త్నించిన 7 వ డివిజ‌న్ కార్పోరేట‌ర్ వేముల శ్రీనివాస్ నేరం రుజువుకు కావ‌డంతో ఖ‌మ్మం సెంట్రల్ జైలుకు పంపించారు. తాజాగా జ‌క్కుల ర‌వీంద‌ర్ రిమాండ్‌తో భూ క‌బ్జాల‌కు పాల్పడుతున్న కార్పోరేట‌ర్ల వెన్నులో వ‌ణుకు పుడుతోంది.



Next Story