నీళ్ల తొట్టిలో విష గుళికలు… రెండు ఎడ్లు మృతి

by Disha Web Desk 11 |
నీళ్ల తొట్టిలో విష గుళికలు… రెండు ఎడ్లు మృతి
X

దిశ,జనగామ: మూగజీవాల ఉపీరి తీసాడు ఓ దుర్మార్గుడు. రైతు మీద కక్షతో పశువులు నీళ్లు తాగే తొట్టిలో విష గుళికలు కలపడంతో ఆ నీటిని తాగిన రెండు కాడెడ్లు మృత్యువాత పడగా, మరొకటి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బానోతు తిరుపతికి చెందిన మూడు పశువులు పొలం వద్ద కొట్టంలో కట్టేసి ఇంటికి వచ్చాడు. అయితే గుర్తు తెలియని దుండగులు పశువులు నీళ్లు తాగే తొట్టిలో విష గుళికలు కలిపారు. అవి గమనించక అసలే వేసవి కాలం కావడంతో తీవ్ర దాహంతో ఉన్న మూడు పశువులు ఆ నీటిని కడుపారా తాగాయి. దీంతో ఆ మూడింటిలో రెండు మృత్యువాత పడగా ఒకటి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. పశువులు మృతి చెందడంతో ఆ రైతు కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. మూగజీవాల ఉసురు తీసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story

Most Viewed