ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు కృషి చేయాలి : సీఐ

by Disha Web Desk 23 |
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు కృషి చేయాలి : సీఐ
X

దిశ,కొత్తగూడ : శాసన సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో మండలంలోని సాధి రెడ్డిపల్లి, పోగుల్లపల్లి కొత్తగూడ గ్రామలలో గూడూరు సీఐ ఫణిధర్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా సీఐ ఫణిధర్ మాట్లాడుతూ... రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవద్దన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటేయడం తమ బాధ్యతగా భావించాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసమే పోలీసు కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేయాలని కోరారు.

హింసకు తావు లేకుండా ఎన్నికల నిబంధనలు విధిగా అందరూ పాటించాలన్నారు. వివిధ పార్టీల ప్రచార నిమిత్తం గ్రామాల్లో వచ్చే వారిని అడ్డుకోవద్దని సూచించారు. ప్రజా స్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. ఓట్ల కోసం నగదు, వివిధ రూపాల్లో బహుమతులు అందిస్తే తీసుకోవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారం తప్పక అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ, గంగారం ఎస్సై లు నగేష్, దిలీప్ లు కానిస్టేబుల్లు భోజ్య నాయక్,గణపతి, దిలీప్, భరత్, కిషోర్, ప్రశాంత్ లు,కేంద్ర బలగాలు భారీగా పాల్గొన్నారు.

Next Story

Most Viewed