​జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్ రాహుల్ శర్మ

by Nallavelli.Anjaneyulu |

భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం జారీ చేసిన వాతావరణ నివేదిక ప్రకారం.. జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకోనున్నాయని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటనలో తెలిపారు.

​జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి :  కలెక్టర్ రాహుల్ శర్మ
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం జారీ చేసిన వాతావరణ నివేదిక ప్రకారం.. జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకోనున్నాయని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు (64.5 నుండి 115.5 మి.మీ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింధని తెలిపారు. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని ,ఆకాశము మేఘావృతమై ఉన్నప్పుడు ఉరుములు, తీవ్రమైన మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని సూచనలు చేశారు . వాతావరణంలో తలెత్తే ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. వర్షం వచ్చే సమయంలో చెట్ల కిందకు ఎవరు పోకూడదని ఆయన తెలిపారు.

Next Story