మోదేడులో పోలీస్ అధికారుల పల్లె నిద్ర

by Dishanational1 |
మోదేడులో పోలీస్ అధికారుల పల్లె నిద్ర
X

దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలమండలంలోని మోదేడు గ్రామంలో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు పల్లె నిద్ర చేశారు. పలిమెల ఎస్సై అరుణ్ తో కలిసి డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమంలో గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో డీఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో అనుమానితులకు, మావోయిస్టులకు ఆశ్రయం కల్పించవద్దని అన్నారు. మావోయిస్టులు వారి కాలం చెల్లిన విధానాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, వారి వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మావోయిస్టులకు సహాయం చేయడం లేదా ఆశ్రయం కల్పించడం చట్ట పరంగా నేరం.. అందువల్ల వారికి శిక్షలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా అటవీ భూములను పోడు చేయకుండా అడవిని కాపాడుకోవాలని అన్నారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. చట్టాలను అతిక్రమించేవారు ఎవరైనా శిక్షలు పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed