మా ఇళ్లను ఓసీపీ మట్టితో చుట్టుముట్టారు

by Disha Web Desk 23 |
మా ఇళ్లను ఓసీపీ మట్టితో చుట్టుముట్టారు
X

దిశ, మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల-1 ఓసీపీ కోల్ మైనింగ్ అండర్ ప్రాజెక్టులో భూ నిర్వాసితులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఓ సీపీ ప్రాజెక్టు మట్టి కుప్పలతో మా ఇండ్లను చుట్టుముట్టారు. దుమ్ము ధూళి ఇళ్లల్లో పేర్కొ పోతున్నాయి. విష సర్పాలు సంచరిస్తూ భయభ్రాంతుల గురి చేస్తున్నాయని ఎలా బతకడం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఓసీపీ ప్రాజెక్ట్ నిర్మాణానికి సాగు భూములు ధారాదత్తం చేయడంతో సర్వం కోల్పోయాం, ఉపాధి లేక రోడ్డున పడ్డాం కడుపున పుట్టిన బిడ్డలకు ఉపాధి కరువైంది ఎలా బతుకుడు అంటూ మహిళల కంట కన్నీళ్లు చెమ్మగిల్లాయి. భూములు సేకరించే సమయంలో హామీలు ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఉద్యోగాలు ఇవ్వడంలో ముఖం చాటేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన భూ నిర్వాసితులు చేపట్టిన నిరసన అండర్ కోల్ మైనింగ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన బొగ్గు నిక్షేపాలు వెలికితీత పనులను చేపట్టిన ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థతో ముప్పు వాటిల్లింది. మమ్ములను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పునరావాస ప్యాకేజీ ప్రకటించండి ఓసీపీ ప్రాజెక్ట్ కోసం సాగు భూములు కోల్పోయిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ తో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, జెన్కో అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీపీ ప్రాజెక్టు వల్ల దుమ్ము ధూళితో ఊపిరి ఆడలేక, బొగ్గు వెలికితీత సమయంలో బ్లాస్టింగ్ వల్ల వెదజల్లుతున్న పొగ వల్ల సతమతమవుతున్నామని ఎన్నిసార్లు అధికారులను వేడుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవని అధికారులు తీరుపై నిర్వాసితులు మండిపడ్డారు.

నిర్వాసితులు చేపట్టిన నిరసనతో కోల్ మైనింగ్ ప్రాజెక్టు లో మట్టి తవ్వకాలు, బొగ్గు నిక్షేపాలు వెలికి తీస్తున్న యంత్రాలను ఆడుకోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఐదు గంటల వరకు కొనసాగిన ఈ నిరసన వల్ల ఓసీపీ ప్రాజెక్టు లో పోలీసు బలగాలు, సిఆర్పిఎఫ్ దళాలు మోహరించాయి. ఎక్కడికక్కడ ఆందోళన చేపడుతున్న నిర్వాసితులను కట్టడి చేస్తూ నిరసన చేస్తున్న నిర్వాసితులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా ససేమీరా అంటూ ఎండను సైతం లెక్కచేయకుండా బిస్మించి కూర్చున్నారు. జెన్కో అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించితే కానీ మా సమస్య పరిష్కారం కాదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏండ్లు గడుస్తున్న మా బతుకులకు మార్పు రాలేదు. మా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు.. ఎలా బతకడం ఏఎమ్మార్ ప్రైవేట్ సంస్థ ఆగడాల వల్ల మాకు ఆత్మహత్యే శరణం అంటూ ఆందోళన చెందడంతో స్పందించిన డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డి జెన్కో అధికారులను పిలిపించి సమస్య సద్దుమణిగేలా నిర్వర్షితులతో పరిష్కరించాలని సూచించడంతో చెల్పూర్ థర్మల్ పవర్ ప్లాంట్ సీఈ సిద్దయ్య నిర్వాసితుల నిరసన ప్రదేశానికి చేరుకుని ఐదు నెలల్లో మీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు నిరసనను విరమింప చేశారు.

భూములు కోల్పోయిన అందరికీ ఉద్యోగం ఇయ్యాలే ఇండ్లను సేకరించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలి. సేకరించిన పెండింగ్ భూములు, మిగులు భూములకు నష్టపరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. హామీలు కాదు అమలు చేయాలని వేడుకున్నారు. ఓసిపి ప్రాజెక్ట్ నిర్వాసితుల నిరసనతో ముందస్తుగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించారు. ఐదుగురు ఎస్ఐలు ఇద్దరు సీఐలతో 50 మంది పోలీసులు పదిమంది సిఆర్పిఎఫ్ బలగాలతో కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తుతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.


Next Story

Most Viewed