అమలైన ఎన్నికల కోడ్.. టీడీపీ స్థూపానికి ముసుగు మరిచిన అధికారులు..

by Sumithra |
అమలైన ఎన్నికల కోడ్.. టీడీపీ స్థూపానికి ముసుగు మరిచిన అధికారులు..
X

దిశ, బయ్యారం : రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా బయ్యారం మండలంలో పలు పార్టీల స్తూపాలకు ముసుగు ధరించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో టీడీపీ స్థూపానికి ముసుగు ధరించకుండా, అధికారులు వదిలేయడంతో, ఆ స్థూపాన్ని చూసిన పలువురు రాజకీయ నాయకులు, టీడీపీ స్థూపం మర్చిపోయారా.. లేదా.. కావాలనే వదిలేసారా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎన్నికల కోడ్ సందర్భంగా ముసుగు ధరించి ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు కోడ్ ను అమలుపరచాలని, పలువురు కోరుతున్నారు. దీని పై పంచాయతీ సెక్రెటరీ శ్రీధర్ ను వివరణ కోరగా తమ సిబ్బంది ఎన్నికల కోడ్ సందర్భంగా టీడీపీ స్థూపానికి ముసుకు ధరించటం మర్చిపోయినట్లు తెలిపారు. వెంటనే ముసుగు ధరిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed