ఆల్ ఇండియా కోటా బీహెచ్ఎంఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ

by Disha Web Desk 20 |
ఆల్ ఇండియా కోటా బీహెచ్ఎంఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
X

దిశ, ఎంజీఎం సెంటర్ : అల్ ఇండియా కోటా బీహెచ్ఎంఎస్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలోని అల్ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 8గంటల నుండి 17వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అన్ లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా నీట్ 2022 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in ను చూసుకోవాలనీ యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.


Next Story

Most Viewed