పదిహేనేళ్లలో పాలకుర్తికి చేసింది శూన్యం : యశస్విని రెడ్డి

by Disha Web Desk 23 |
పదిహేనేళ్లలో పాలకుర్తికి చేసింది శూన్యం :  యశస్విని రెడ్డి
X

దిశ,పాలకుర్తి(పెద్దవంగర) : మండలంలోని కోరి పల్లి,కాన్వాయ్ గూడెం, గాంట్ల కుంట్లా,మోతాయే తండా గ్రామాల్లో సోమవారం ఇంటింటికి కాంగ్రెస్- గడపగడపకు జాన్సమ్మ పేరిట కాంగ్రెస్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి హనుమాండ్ల యశస్విని రెడ్డి పాల్గోన్నారు. ఆమె మాట్లడుతూ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు వచ్చానని,ఆడపడుచుగా ఆదరించి ఒక్క అవకాశం ఇస్తే మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఐదేళ్లు సేవ చేస్తానని ఆమె అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం,ప్రతి ఇంటా సంక్షేమం చేకూరుతుందని, పేదల సంక్షేమం కోసమే విద్యార్థుల చదువుకు రూ. 5 లక్షలు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రూ. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు, పంట ఉత్పత్తులకు రూ. 500 బోనస్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, పింఛన్ రూ. 4 వేలకు పెంపు వంటి ప్రజారంజక ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసేందుకై రూపొందించడం జరిగిందన్నారు.

ప్రజలు తమ భవిష్యత్తును ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు.నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవించి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకు ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని,ఆడపడుచుగా ఆదరించి గెలిపిస్తే ఎమ్మెల్యేగా తనకు వచ్చే వేతనాన్ని కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తూ పాలకుర్తి నియోజకవర్గం ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతానని ఆమె చెప్పారు.అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని దయాకర్ రావు బెదిరింపులకు అధికార పార్టీ బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన పని లేదని,అండగా ఉంటూ అందరినీ కాపాడుకుంటానని కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Next Story