- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
గతంలో ఎన్నో ఏళ్లుగా పాలించిన ఏ ప్రభుత్వం కూడా రైతుల పట్ల ఆలోచించలేదు : గండ్ర వెంకట రమణారెడ్డి

దిశ, శాయంపేట : భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రచారంలో పాల్గోన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 10 హెచ్పీ మోటార్ గల మూడు గంటలు చాలని ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారని రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి రైతులకు టెన్ హెచ్ పి మోటార్ మీ అయ్య కొనిస్తాడా... నీ బాబు కొనిస్తాడా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అని అన్నారు. ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నో ఏళ్లుగా పాలించిన ఏ ప్రభుత్వం కూడా రైతుల పట్ల ఆలోచించలేదు రైతుల గురించి ఆలోచించి ఉంటే రైతులకు 24 గంటల కరెంట్ రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేదు ఆలోచించాలని ఎరువుల కోసం చెప్పులు వరుసలో పెట్టి లాఠీ దెబ్బలు తిన్న సంఘటనలు ప్రజలు గుర్తు చేసుకోవాలని అన్నారు.
ఎన్నికల్లో గెలిచిన వెంటనే శాంపేట మండల కేంద్రంలో పద్మశాలి కుల సంఘానికి కోటి రూపాయలతో ఆత్మగౌరవ భవనాన్ని ఏర్పాటు చేస్తానని ఇటీవల రోడ్డు వెడల్పులో పోయిన కుటుంబాల అందరికీ గృహలక్ష్మి ద్వారా ఇళ్లను అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి వైస్ ఎంపీపీ లతా లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి సర్పంచ్ భూక్య రమేష్ గ్రామ శాఖ అధ్యక్షుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.