మూడు వారాలుగా మంచినీటికి కటకట.. ఖాళీ బిందెలతో నిరసన

by Disha Web Desk 23 |
మూడు వారాలుగా మంచినీటికి కటకట.. ఖాళీ బిందెలతో నిరసన
X

దిశ, గార్ల : గత మూడు వారాలుగా మంచినీటి సరఫరా లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం అని సీపీఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పుల్లూరు పంచాయతీ పరిధిలోని సూర్య తండా లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో తండాలో రోడ్డుపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏజెన్సీ మండలాలలో మంచినీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన మండల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సుమారుగా 20 కుటుంబాలకు నీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గిరిజన మహిళలు వాపోతున్నారు.అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన మంచినీటి సమస్యను పరిష్కరించి గిరిజనుల దాహార్తిని తీర్చాలని లేని యెడల దశల వారీగా ఆందోళన చేపడతామని శ్రీనివాస్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అజ్మీరా శ్రీను,రమేష్, సాయి,నరేష్, ప్రవీణ్, రాందాస్, సీతా, మంజుల,హరి లక్ష్మీ, బాస్,వినోద్, కాంతి,భీమ్లా,మంగి,నీలా,మంగ్యి తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed