ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే గండ్ర

by Kalyani |
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే గండ్ర
X

దిశ,చిట్యాల: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా, శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన మీటింగ్ లో గూట్ల తిరుపతి అధ్యక్షతన,ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి, ఆశీర్వదించి, గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఏడాదిలో మేం చేసిన అభివృద్ధి పనులకు, ప్రతి గుండెకు, ప్రతి గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం అని, మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని, రాష్ట్ర మహిళలు సంతోషంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటేశ్వర్లు చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు.

“అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు చేసుకొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలైనా ఏకకాలంలో రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, వరికి మద్దతు ధరతో పాటు, 500 రూపాయల బోనస్ అందివ్వటం. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ, ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు చేసి, వంటగ్యాస్ సిలిండర్ కు 500 రూపాయలకే ఇస్తూ, 56 వేల ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత ,మా ప్రభుత్వానిదేనని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. “ ప్రభుత్వం రాబోయే రోజుల్లో సంక్రాంతికి గాని, ఉగాదికి గాని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, సన్న రైస్ బియ్యాన్ని అందించబోతుందని, ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను కూడా కట్టిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, యువకులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.

అటు బీజేపీ వాళ్లు గాని, ఇటు బిఆర్ఎస్ వాళ్ళు గాని, మా ప్రభుత్వం సంవత్సర కాలంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి, ఓర్వలేక ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారాలను చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందిస్తామని తెలిపారు. విద్య, వైద్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉందని, ఆ దిశగానే ముఖ్యమంత్రి శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. సుభిక్షమైన తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యేలము అందరం ప్రతి రోజు 18 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నమని అన్నారు. ఇంకా నెలకు రూ .₹2500 మహిళలకు ఇచ్చేది ఉంది అది కూడా ఇచ్చి తీరుతామన్నారు. ఆడబిడ్డల దీవెనలు మా ప్రభుత్వానికి ఉండాలని తెలంగాణ ఇచ్చిన పార్టీని మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేశాడు.

హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో పది వేల ఎనిమిది వందల దుప్పట్లు, బెడ్ షీట్, బ్యాంక్ లేట్ లు తో పాటు, వేడి నీళ్లనందించే మిషన్ లను ప్రతి హాస్టల్ లోవిద్యార్థులకు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఓబిసి చైర్మన్ కత్తి వెంకటస్వామి, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతే ప్రకాష్ రెడ్డి ,రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, రామ్ నర్సింహారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి,జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కామిడీ రత్నాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రాయకోమురు ,ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్ నందరాజు, రవి, శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు అల్లకొండ కుమార్,. టౌన్ అధ్యక్షులు లక్ష్మణ గౌడ్ ,రవి, కుమార్, ఎమ్మార్వో, ఎంపీడీవో ,మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story