ప్లాస్టిక్ బాటిల్‌లతో నూతన బస్టాండ్...

by Dishaweb |
ప్లాస్టిక్ బాటిల్‌లతో నూతన బస్టాండ్...
X

దిశ, కమలాపూర్: గ్రామాల్లో సేకరించిన ప్లాస్టిక్ బాటిల్‌లతో ప్లాస్టిక్ హబ్ పేరిట నూతన బస్టాండ్ అందరినీ ఆకట్టుకుంటూ పలువురు సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతుంది.హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ పల్లి గ్రామపంచాయతీలో నిత్యం గ్రామంలో సేకరించిన వ్యర్ధాలను పంచాయతీ సిబ్బంది సెగ్రిగేషన్ షెడ్ కు తరలిస్తున్నారు. అందులో వచ్చిన ప్లాస్టిక్ బాటిల్లను ఓ మూలన పడేస్తున్నారు. విధుల్లో భాగంగా గ్రామ తనిఖీకి వచ్చిన ఎంపీడీవో పల్లవి సర్పంచ్ ఉమాకు ఈ ఆలోచన అందజేశారు.

దీంతో సర్పంచ్ సిబ్బంది సహకారంతో గ్రామంలోని ఇంటికొక ప్లాస్టిక్ బాటిల్ తో పాటు, ఊర్లో సేకరించిన ఖాళీ ప్లాస్టిక్ సుమారు 1200 బాటిల్లతో నాలుగైదు రోజుల్లోనే వినూత్నంగా ప్రయాణికుల కోసం ప్లాస్టిక్ హబ్ పేరిట నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. బస్టాండ్కు చుట్టుపక్కల ఖాళీ ప్లాస్టిక్ బాటిల్లను ఏర్పాటు చేసి గడ్డి పూల మొక్కలను బాటిళ్లతో అందంగా అలంకరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మనమంతా పాటుపడాలని మెసేజ్ ఇవ్వడంతో పాటు, వేస్టేజ్ ను ఇలా కూడా చేయొచ్చని నిరూపించి చూపారు. ఊరు చిన్నదేనా వారు చేసిన ఆలోచన ఎందరికో ఆదర్శంగా నిలవనుంది. ప్లాస్టిక్ బాటిల్లతో అందంగా నిర్మించిన బస్టాండ్ వద్ద ప్రయాణికులు, స్థానికులు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తయారీదారులకు కితాబిస్తున్నారు.Next Story