దిశ ఎఫెక్ట్.. స్పందించిన ఎంపీడీఓ, ఎంపీఓలు

by Sumithra |
దిశ ఎఫెక్ట్.. స్పందించిన ఎంపీడీఓ, ఎంపీఓలు
X

దిశ, మంగపేట : సోమవారం దిశ టాబ్లాయిడ్ లో వచ్చిన ‘ కంపుకొడుతున్న శానిటరీ కాంప్లెక్స్ ’ లు వార్తకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి భద్రు, ఎంపీఓ మమతలు స్పందించారు. మండలంలోని మంగపేట, మల్లూరులో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను పంచాయతీ సిబ్బందితో మంగళవారం క్లీన్ చేయించి వాడుకలోకి తెచ్చారు. స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా నిర్మించిన మండలంలోని పలు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులకు నల్లాల కనెక్షన్ లేక ప్రజలు వాడుకునేందుకు నీరు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

ఈ విషయాన్ని దిశ వెలుగులోకి తేవడంతో స్పందించిన ఎంపీడీఓ భద్రు, ఎంపీఓ మమతలు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించి మంగళవారం సిబ్బందితో శుభ్రం చేయించారు. పంచాయతీల జనరల్ ఫండ్ నుండి సామూహిక మరుగుదొడ్లకు వాటర్ కనెక్షన్ ఇచ్చి నిత్యం ప్రజలు వాడుకునే విధంగా ఉపయోగంలో ఉంచనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనృసింహాస్వామి ఆలయం రోడ్డులో నిర్మించిన సామూహిక మురుగుదొడ్డిని వెంటనే వినియోగంలోకి తెచ్చి భక్తులు వాడుకునే విధంగా వాటర్ పైపులైనుతో మరుగుదొడ్డి, మూత్రశాలలను ప్రజలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కంపు కొడుతున్న శానిటరీ కాంప్లెక్సుల వార్తను దిశ వెలుగులోకి తెచ్చి వినియోగంలోకి తేవడంతో ఆయా గ్రామాల ప్రజలు దిశకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed