క్రూ రైళ్ల లింక్ ల తరలింపును అడ్డుకోవాలి : కర్ర యాదవ రెడ్డి

by Aamani |
క్రూ రైళ్ల లింక్ ల తరలింపును అడ్డుకోవాలి :  కర్ర యాదవ రెడ్డి
X

దిశ,వరంగల్ కలెక్టరేట్: ఉమ్మడి వరంగల్ జిల్లాలకు అతి కీలకమైన ఉత్తర దక్షిణాది వారధిగా విలసిల్లుతున్న కాజీపేట జంక్షన్ ఉనికిని కాపాడాలని కాజీపేట జంక్షన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, కర్ర యాదవ రెడ్డి అన్నారు. కాజీపేట జంక్షన్ నుంచి క్రూ రైళ్ల లింక్ల తరలింపును అడ్డుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రూ-రైళ్ల లింకుల తరలింపు కొనసాగితే కాజీపేట జంక్షన్ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇలాగే రైళ్ల తరలింపు జరిగితే కాజీపేట జంక్షన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేసి వాటిని అడ్డుకున్నామని గుర్తు చేశారు.

మళ్లీ ఇప్పుడు జరుగుతున్న లింక్ తరలింపులను కూడా అడ్డుకుని కాజీపేట జంక్షన్ ను, తద్వారా స్థానిక ఉపాధి అవకాశాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. కోచ్ ఫ్యాక్టరీని సాధించలేని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాజీపేట జంక్షన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కాజీపేట జంక్షన్ కు జరుగుతున్న అన్యాయం గురించి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, ఇతర ఎమ్మెల్యేల సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. అలాగే ఉమ్మడి వరంగల్ బీజేపీ నేతల సహకారంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి కాజీపేట జంక్షన్ ను పరిరక్షించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో కాజీపేట జంక్షన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కర్ర యాదవ రెడ్డి ఎస్సీ,ఎస్‌టి రైల్వే ఎంప్లాయూస్ యూనియన్ నేత కురుసపల్లి రవీందర్, కాజీపేట జంక్షన్ పరిరక్షణ సమితి నాయకుడు దుర్గా ప్రసాద్, రైల్వే అసోసియేషన్ పెన్షనర్స్ ప్రెసిడెంట్ సంగమయ్య, రైల్వే జేఏసి నాయకుడు కొండ్ర నర్సింగరావు, ఏంసీపీఐ నాయకురాలు మాస్ సావిత్రి, వి.మహేందర్ రెడ్డి, మల్లేశం, లింగాల ఇమ్మానుయేల్, దినకర్, ఎన్జిఓ నిర్వహకురాలు రోజి రంజిత, విద్యార్థి నేతలు గణేష్, రోహిత్, వంశీ, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed