వారిచేతుల్లో మోసపోవద్దు.. రైతులకు ఎమ్మెల్యే సూచనలు

by Web Desk |
వారిచేతుల్లో మోసపోవద్దు.. రైతులకు ఎమ్మెల్యే సూచనలు
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: పంటలను అమ్ముకునే సమయంలో దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని ఎమ్మెల్యే టీ రాజయ్య సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి పండించిన పంటలను అమ్ముకునే సమయంలో దళారుల చేతిలో మోసపోవద్దని రైతులకు సూచించారు. జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలు జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లలో మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని కంది రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రైవేటు వ్యక్తులు క్వింటాను రూ.5300 లకు కొనుగోలు చేస్తే ప్రభుత్వం మాత్రం రూ.6300 చెల్లిస్తుందని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎం మహేష్ కుమార్, డిఎంఓ నాగేశ్వర్ శర్మ, వైస్ చైర్మన్ చల్ల చందర్ రెడ్డి, మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్, జఫర్గడ్ ఎంపీపీ సుదర్శన్, జడ్పిటీసీ బేబీ శ్రీనివాస్, డైరెక్టర్లు, రైతులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed