దళితుల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దళిత బంధు పథకం.. MLA అరూరి రమేశ్

by Dishafeatures2 |
దళితుల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దళిత బంధు పథకం.. MLA అరూరి రమేశ్
X

దిశ, ఐనవోలు: దశబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురైన దళితులను ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించి సమాజంలో ఉన్నతంగా జీవించాలానే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం దళిత బంధు పథకం ద్వారా మంజూరు అయిన 9 ట్రాక్టర్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అరూరి రమేష్ హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని లబ్ధిదారులకు సూచించారు. తాము ఉపాధి పొందటమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పించాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.


సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని, దళితులు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నెని మధుమతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి, జడ్పి కో ఆప్షన్ ఉస్మాన్ అలీ, మండల కో ఆప్షన్ గుంశావాలి, సర్పంచ్ రజిత, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్, ఐనవోలు ఆలయ చైర్మన్ మజ్జిగ జైపాల్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఐనవోలు ఆలయ మాజీ చైర్మన్ మునిగాల సంపత్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed