ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి.. Minister Satyavathi

by Javid Pasha |
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి.. Minister Satyavathi
X

దిశ, మహబూబాబాద్ టౌన్: ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని గుమ్ముడూరు 13వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే శంకర నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ శశాంక తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి సత్యవతి ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకొని కళ్లద్దాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వాళ్లకు కళ్లద్దాలు కూడా ఇస్తామని చెప్పారు. జిల్లాలో 100 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. కళ్లు అనేవి మానవ శరీరంతో అతి ముఖ్యమైన అవయవాలు అని, వాటికేమైనా జరిగితే అంధత్వం వచ్చి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు.

అందుకే ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. కంటి పరీక్షల విషయంలో నిర్తక్ష్యం తగదన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చూపు పోయే ప్రమాదం ఉందని చెప్పారు. కళ్ళను కూడా దానం చేయగలిగితే పునర్జన్మ కూడా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి కంటి వెలుగు నోడల్ అధికారి శ్రీనివాస్ గుమ్మడూరు 13 అవార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజు, ఉపవైద్యాధికారులు ఉమా గౌరీ, డాక్టర్ అంబరీష, వైద్యశాక సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More... నిరుపేదలను ఆర్ధికంగా ఆదుకోవడానికి 'కంటి వెలుగు': ఎమ్మెల్యే బీరం

Next Story