- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Minister Ponnam : నక్షత్ర దీక్ష స్వీకరించిన మంత్రి పొన్నం
దిశ, భీమదేవరపల్లి: శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సామెత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుంది. నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదం తో శాసన సభ్యుడిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటానని మొక్కు కోవడం జరిగింది. మంగళవారం రోజున దీక్ష తీసుకొని 27 రోజులు దేవాలయ నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సహిత వీరభద్రస్వామి. నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగింది. శ్రీశైలం రెండవ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడి పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి విగ్రహం ఉంటుంది. బయటకు రాగానే వేములవాడ రాజ రాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి.పూజలు జరుగుతాయి. ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయంలో ఉమ్మడి కరీంనగర్ , వరంగల్ ,మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా అందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజనా సుఖినోభవంతు రైతులు వ్యవసాయం ,ఈ మధ్య అనేక అనారోగ్య సమస్యలు వస్తుండడంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశ్యామలం గా బాగుండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగింది.
హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా ధైర్యాన్ని మనో భలాన్ని ఇవ్వాలని వీరభద్రస్వామి కోర మీసాల స్వామిని వేడుకుంటున్నాను. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం కోట్లాడే ధైర్యం ఇవ్వాలని అనేక సందర్భాల్లో మొక్కుకున్నారు. మంగళవారం రోజున నియోజకవర్గ అభివృద్ధి ఇక్కడి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా అన్ని కార్యక్రమాల్లో విజయవంతం అయ్యేలా ఆ భగవంతుడి ఆశీర్వచనాలు ఉండాలని ఈ మాల అలంకరణ వేసుకున్నాను. సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలని కొత్త కొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నారు. ఈకార్యక్రమంలో కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ నిర్వాహకులు కిషన్ రావు, ఆలయ అర్చకులు రాజయ్య, మొగిలిపాలెం రాంబాబు, సందీప్, ముల్కనూరు ఎస్సై నండ్రు సాయిబాబు, వేలేరు ఎస్సై ఎన్ సురేష్, కొలుగూరి రాజు ఆదరి రవిందర్, ఊస కోయిల ప్రకాష్, శేఖర్ గుప్తా, కేతిరి లక్ష్మారెడ్డి, మంగ రాంచంద్రం, కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, నరేందర్ గౌడ్, గుడికందుల రాజు, తదితరులు ఉన్నారు.