మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ

by Dishafeatures2 |
మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ
X

దిశ, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండ‌లంలోని ప‌లు అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ఐటీ, పురపాలక శాఖ‌ల మంత్రి కేటీఆర్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది. మంగ‌ళ‌వారం గూడూరుకు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో చేరుకున్న మంత్రి కేటీఆర్ క‌స్తూర్భా పాఠశాల వెళ్తుండ‌గా ఎన్ ఎస్ యూఐ విద్యార్థి నేత‌లు కేటీఆర్ రోడ్ షో మ‌ధ్య‌లోకి దూసుకొచ్చి న‌ల్ల‌బ్యాడ్జీలతో మంత్రి కేటీఆర్‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళ‌న‌కారుల‌ను కాన్వాయ్ ఎదుట నుంచి త‌ప్పించేందుకు పోలీసులు శ్ర‌మించారు. అయితే ఇదే స‌మ‌యంలో కొంత‌మంది బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అత్యుత్సాహం చూపుతూ ఆందోళ‌న‌కారుల‌పై పిడుగుద్దులతో , బిఆర్ఎస్ జండా కర్రలతో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. విద్యార్థులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అనంతరం ఎన్ఎస్యూఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.


పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మొట్ట మొదటిసారిగా ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించారు. మండల కేంద్రంలోని గూడూరు గ్రామ శివారు నుండి రోడ్ షో నిర్వహించి నూతనంగా నిర్మించిన ఎం జె పి పాఠశాలలను, జూనియర్ కళాశాల, పలు కుల సంఘల భవనాలకు, బస్ స్టేషన్,పలు దేవాలయాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎం జె పి పాఠశాల గదిలో డిజిటల్ క్లాసులను ప్రారంభించి, పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, ఒడితల సతీష్ బాబు జడ్పీ చైర్ పర్సన్ కనుమల విజయ, సుధీర్ బాబు, జిల్లా, మండల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed