మోటార్లకు మీటర్లు పెట్టమని మోడీ ఒత్తిడి చేస్తుండు: మంత్రి ఎర్రబెల్లి

by Dishanational1 |
మోటార్లకు మీటర్లు పెట్టమని మోడీ ఒత్తిడి చేస్తుండు: మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, దేవరుప్పుల: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం దేవరుప్పుల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్ లో ఎంపీపీ బస్వ సావిత్రి అధ్యక్షతన నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు, బతుకమ్మలు, కోలాట ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మహిళలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి, రైతు బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని, సీఎం కేసీఆర్ మహిళలకు పెద్ద కొడుకుగా, పెద్దన్నగా పుట్టింటి కానుక రూపంలో చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, ఇంటింటికి మంచినీరు, దళిత బంధు, దేవాదుల ద్వారా ప్రతి గ్రామానికి కాలువ ద్వారా సాగునీరు తదితర అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సంక్షేమానికి నిలయంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు.

మహిళలకు అన్ని విభాగాల్లో అగ్రపీఠం వేస్తూ వారికి వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. రైతులను మోసం చేస్తూ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై ఒత్తిడి చేస్తోందని, సీఎం కేసీఆర్ గొంతులో ప్రాణమున్నంత రకు మోటార్లకు మీటర్లు పెట్టేదిలేదని తేల్చి చెప్పి రైతుల పక్షాన నిలబడ్డ ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ కాదా ప్రశ్నించారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనిస్తూ వారిని ముందంజలో నడిపిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సామాజిక వర్గం అంతా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉండాలని కోరారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు లేవని అన్నారు. బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులను తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు, కానీ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు అసత్య ప్రచారంతో మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ కేసీఆర్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని.. వారి విమర్శలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హమీద్ డీఆర్డీఓ పీడీ రాంరెడ్డి, ఏసీపీ శ్రీనివాసరావు, తహశీల్దార్ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ పళ్ళ భార్గవి, మహిళ సర్పంచులు ఆకవరం సృజన, పెద్దారెడ్డి, దేవరుప్పుల సర్పంచ్ ఈదునూరి రమాదేవి నరసింహారెడ్డి, కామారెడ్డి గూడెం సర్పంచ్ బిల్లా అంజమ్మ యాదవ రెడ్డి, ధర్మగడ్డ సర్పంచ్ గూగులోత్ సునీత, పోతిరెడ్డి బ్లేతినా లినారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బస్వ మల్లేష్, పల్లా సుందర్, రాంరెడ్డి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి చింత రవి, మండల అధికార ప్రతినిధి సుడిగెల హనుమంతు, జిల్లా యువజన నాయకులు కోతి ప్రవీణ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీల అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Next Story

Most Viewed