జనసంద్రంతో నిండిపోయిన చింతల గట్టు మినీ మేడారం జాతర

by Disha Web Desk 7 |
జనసంద్రంతో నిండిపోయిన చింతల గట్టు మినీ మేడారం జాతర
X

దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల గ్రామ శివారులోని చింతల గట్టు మినీ మేడారం శ్రీ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం మొత్తం భక్తులతో నిండిపోయింది. ఈ క్రమంలో అమ్మవారికి బోనమెత్తి పట్టు వస్త్రాలను సమర్పించారు గూడూరు జెడ్పీటీసీ గుగులోత్ సుచిత్ర బాలు నాయక్. చింతల గట్టు మినీ మేడారం జాతరకు మండలంలోని వివిధ గ్రామాల నుండే కాకుండా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. తల్లుల గద్దేల వద్ద ఉన్న పసుపు, కుంకుమను దేవతలుగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించిన అనంతరం ఆ అటవీ ప్రాంతంలో వంటలు వండుకుని ఒక రోజు మొత్తం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గూడూరు నుండి మహబూబాబాద్ వెళ్లే రోడ్డు మార్గాన అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా జనసంద్రమే కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశామని ఆలయ ప్రధాన పూజారి దారం సిద్దు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


Next Story

Most Viewed