కేఎంసీలో ర్యాగింగ్‌కు పాల్పడిన మెడికోలు మూడు నెలల పాటు సస్పెండ్

by Disha Web Desk 8 |
కేఎంసీలో ర్యాగింగ్‌కు పాల్పడిన మెడికోలు మూడు నెలల పాటు సస్పెండ్
X

దిశ,కేయూ క్యాంపస్ : జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజ్ కళాశాల లో రాజస్థాన్ కు చెందిన మెడికల్ విద్యార్థిపై కొందరు విద్యార్థులు దాడికి పాల్పడ్డారని 15వ తారీఖున కేసు నమోదు అయింది. అయితే ఈ కేసు వెలుగులోకి రావడంతో కేఎంసీ ప్రిన్సిపాల్ డా మోహన్ దాస్ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై ఈ దాడికి సంబంధించిన ఏడుగురిని కళాశాల నుంచి మూడు నెలల పాటు,హాస్టల్ నుండి ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో 20 మందికి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించి నోటీసులు వారికి జారీ చేసినట్లు డా మోహన్ దాస్ తెలిపారు. ఈ విషయాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే వీరి పైన కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Next Story

Most Viewed