కాలేశ్వరం క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక

by Sridhar Babu |
కాలేశ్వరం క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక
X

దిశ, కాటారం : ప్రసిద్ధ కాలేశ్వరం క్షేత్రంను మాస్టర్ ప్రణాళికతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించి నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి మాట్లాడారు. ఉత్తర భారతంలో గల కాశి, కేదార్ నాథ్ లో గల శివుడి క్షేత్రాల కంటే కాలేశ్వరం క్షేత్రం పాశస్త్యం కలదిగా పురాణాలు చెబుతున్నాయని, గోదావరి, ప్రాణహిత నదుల సంగమంతో త్రివేణి సంఘమంగా ప్రసిద్ధి చెందడంతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది వెలసిందన్నారు.

మే నెల 15వ తేదీ నుండి సరస్వతి నది పుష్కరాలు 12 రోజుల పాటు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాలేశ్వర క్షేత్రంలో అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర, చత్తీస్గడ్ ప్రభుత్వాల సహాయం తీసుకుంటామని చెప్పారు. మూడు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న కాలేశ్వరంనకు ప్రతిరోజూ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. కాలేశ్వరం క్షేత్రం అభివృద్ధికి 25 కోట్లు వివిధ శాఖల ద్వారా మంజూరు చేసినట్లు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

Advertisement
Next Story