- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన మంగపేట వాసి
by Sumithra |

X
దిశ, మంగపేట : గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో భాగంగా గంట పాటు పియానో ప్లే చేయడంలో సత్తా చాటిన మండల కేంద్రానికి చెందిన సుమ రక్త పరీక్షా కేంద్రం నిర్వాహకుడు మైల రాజు గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. 2024 డిసెంబర్ 1న జరిగిన వరల్డ్ రికార్డ్స్ లో దండింగి వేణుగోపాల్ కు చెందిన హలెల్ సంగీత పాఠశాలకు చెందిన 1046 మంది విద్యార్థులు పాల్గొని ఒక గంట పాటు పియానో ప్లే చేశారు. తర్వాత ఆ వీడియోని ఇన్ స్టా గ్రాంలో అప్ లోడ్ చేయగా దీన్ని గుర్తించిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు మైల రాజును ఎంపిక చేసి 2025 ఏప్రిల్ 14న హైదరాబాద్ మణికొండలోని ది లైఫ్ చర్చీలో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్ ను అందజేశారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన రాజును మండల ప్రజలు, ప్రముఖులు అభినందించారు.
Next Story