- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కన్నుల పండువగా మహా కుంభాభిషేకం

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మహా కుంభాభిషేక మహోత్సవ మహా ఘట్టం ముగిసింది. ఈ సందర్భంగా శివ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో 42 సంవత్సరాల తర్వాత మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆదివారం ఉదయం 10:42 గంటలకు మహా కుంభాభిషేకం నిర్వహించారు.
శత చండీ పారాయణం, సహస్రఘట్టాభిషేకం తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శృంగేరి పీఠానికి సంబంధించిన తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతిచే కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
ముఖ్య అతిథిలుగా పాల్గొన్న ముగ్గురు మంత్రులు
కాలేశ్వరంలో మహా కుంభాభిషేకం కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రాతినిధ్య ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శత చండి హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తరువాత శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం చేశారు.
అనంతరం శుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులవైపు గల నాలుగు రాజగోపురాలపైన ఒకేసారి కుంభాభిషేకం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులకు, అధికారులకు తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి ఆశీర్వచనం చేశారు. పట్టు వస్త్రాలతో సత్కరించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు నిర్వహించారు.