బాల్య వివాహాలను నిర్మూలిద్దాం: పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్

by Disha Web Desk 11 |
బాల్య వివాహాలను నిర్మూలిద్దాం: పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
X

దిశ, హన్మకొండ: బాల్య వివాహాలను నిర్మూలించి బాలల హక్కులను కాపాడుకుందాం అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలో బాల్య వివాహాలతో పాటు భ్రూణ హత్యల నియంత్రణపై కమిషనర్ ఆధ్వర్యంలో శనివారం అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు అధికంగా జరిగే ప్రాంతాలను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం సంబంధిత ప్రతి అధికారి శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు. బాల్య వివాహ నియంత్రణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

అందులో భాగంగా పోలీసులతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. లింగ భ్రూణ హత్యల నియంత్రణకు స్కానింగ్ సెంటర్ల పై నిఘా పెట్టాలని, సెక్సువల్ ట్రాఫికింగ్ పై లోతుగా అధ్యయనం చేసి వ్యభిచారం జరిగే ప్రాంతాలు, నిర్వాహకులపై నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ మురళీధర్, పరిపాల విభాగం అదనపు డీసీపీ పుష్ప రెడ్డి, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed