ఫ్రీగా చికెన్, మందు బాటిళ్లు పంచుతున్న టీఆర్ఎస్ నేత... !

by Dishanational1 |
ఫ్రీగా చికెన్, మందు బాటిళ్లు పంచుతున్న టీఆర్ఎస్ నేత... !
X

దిశ, వెబ్ డెస్క్: ఓ రాజకీయ నేత పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్థానికులకు మందు, కోళ్లు పంచి వార్తల్లో నిలిచాడు. ఆ టీఆర్ఎస్ నేత చేపట్టిన ఆ కార్యక్రమం వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ నేతలు తమ బాస్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మద్దతుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ, వరంగల్ జిల్లాకు చెందిన ఓ టీఆర్ఎస్ నేత మాత్రం స్థానికంగా ఉన్న హమాలీలకు కోళ్లు, మందు(లిక్కర్) ఉచితంగా పంపిణీ చేశాడంట. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story