- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
కుక్కల దాడిలో దూడకు గాయాలు
by Disha Web |

X
దిశ, పెద్దవంగర: కుక్కల దాడిలో గేదె దూడకు గాయాలైన సంఘటన మండలంలోని రామచంద్రు తండాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన పానుగోత్ మంగీలాల్ తనకున్న ఎడ్లను, గేదె దూడలను వ్యవసాయ పొలం వద్ద కొట్టంలో కట్టేశాడు. మధ్యాహ్నం గేదె దూడపై కుక్కలు దాడి చేయడంతో గేదె దూడకు గాయాలయ్యాయి. పొలం వద్దకు వెళ్లిన మంగీలాల్ కి గేదెదూడ గాయాలతో ఉండడాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. మిగితా ఎడ్లు, గేదె క్షేమంగా ఉన్నాయి. గాయాలైన గేదెదూడ విలువ రూ. 15 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.
Next Story