- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో లాక్ష్ ఫౌండేషన్ అవగాహన ఒప్పందం
కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ లక్ష్యంగా బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు.) కుదుర్చుకుంది.

X
దిశ, హన్మకొండ టౌన్ : కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ లక్ష్యంగా బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు.) కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. జ్యోతి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి సంబంధిత నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డిజిటల్ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం నేటి అవసరమని, లాక్ష్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాలు, కెరీర్ మార్గదర్శక శిబిరాలు, పరిశ్రమల ఆధారిత అభ్యాస కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
Next Story






