మహిళల కోసం అంబేద్కర్ ఎంతో పోరాడారు.. కేయూ రిజిస్ట్రార్

by Dishafeatures2 |
మహిళల కోసం అంబేద్కర్ ఎంతో పోరాడారు.. కేయూ రిజిస్ట్రార్
X

దిశ, కేయూ క్యాంపస్: మహిళల హక్కుల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతో పోరాటం చేశారని కేయూ రిజస్ట్రార్ ఆచార్య టీ శ్రీనివాసరావు అన్నారు. బీఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా విశ్వ విద్యాలయ దూర విద్య ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వర్సిటీలోని కేంద్ర లైబ్రరీలో అంబేద్కర్ రచనలు, బోధనలకు సంబంధించిన పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రచనలు చదవాలని సూచించారు. మహిళల కోసం హిందూ కోడ్ బిల్లును రూపొందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని తెలిపారు.


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాజకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఫార్మసీ కళాశాల ప్రన్సిపాల్ డాక్టర్ సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు చదువు, ఉద్యోగం, 6 నెలల ప్రసూతి ఇలాంటివన్నీ అంబేద్కర్ సూచించినవే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Next Story