సమస్యలకు నిలయంగా కస్తూర్బా గాంధీ గురుకుల

by Disha Web Desk 12 |
సమస్యలకు నిలయంగా కస్తూర్బా గాంధీ గురుకుల
X

దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయం లో అనేక సమస్యలకు నిలయంగా మారింది. ప్రధానంగా విద్యార్థులు స్నానం చేయడానికి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు విద్యార్థులు పడుతున్నారు. హాస్టల్‌లో రెండు బోర్లు, ఒక బోరింగ్ ఉన్న కూడ ట్యాంక్‌లోకి నీటిని నింపకుండ హాస్టల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

దీంతో విద్యార్థినిలు ఉదయం పూట లేవగానే గ్రామంలో ఉండే వారి ఇళ్ల వద్దకు వెళ్లి.. బకెట్లతో నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ విధుల్లో ఉండే ఇద్దరు ఉపాధ్యాయుల పరిస్థితి కూడా అలానే ఉంది.

గతంలో కూడా ఇదే పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగి ఉన్నత అధికారులకు తెలియకుండా పదో తరగతి చదువుతున్న విద్యార్థికి టి సి ఇచ్చి పంపించిన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల పై పర్యవేక్షణ లేకుండా పోయిందని గ్రామస్థులు అంటున్నారు. గురుకుల బాలికల పాఠశాల కనుక విద్యార్థులు బయటకు రాకుండా చూసుకోవల్సిన అధికారులు వారి లోపం వలన విద్యార్థులు నీటి కోసం ఉదయం బయట రోడ్లపై బకెట్లు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికయినా ఉన్నత అధికారులు స్పందించి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో నెలకొన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ వారి ఇష్ట రాజ్యాంగ వ్యహరిస్తున్నారన్నారనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఫోన్‌లో అందుబటులోకి రాలేదు.


Next Story

Most Viewed