భూపాల‌ప‌ల్లిలో జ‌ర్నలిస్టుల నిరాహార దీక్ష

by Dishanational1 |
భూపాల‌ప‌ల్లిలో జ‌ర్నలిస్టుల నిరాహార దీక్ష
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు భూపాలపల్లిలో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను కాపాడుకోవ‌డానికి ల‌బ్ధిదారులైన జ‌ర్నలిస్టులు రెండో రోజూ శుక్రవారం రిలే నిరాహార దీక్షను కొన‌సాగిస్తున్నారు. జర్నలిస్టులకు మద్దతుగా శుక్రవారం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దూడపాక సుమన్, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షుడు అప్పకిషన్, వర్తక ప్యాపారుల సంఘం అధ్యక్షుడు ఈగ రవికిరణ్‌, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల అరవింద్, సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజ లింగమూర్తి దీక్షలో కూర్చుని సంఘీభావం ప్రక‌టించారు. కాంగ్రెస్‌, బీజేపీతోపాటు వివిధ రాజ‌కీయ ప‌క్షాలు త‌మ మ‌ద్దతును ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. 2013 వ సంవత్సరంలో భూపాలపల్లి నియోజకవర్గంలో పని చేస్తున్న 47 మంది సీనియర్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల‌ను మంజూరు చేశారు. అయితే ఇటీవ‌ల కలెక్టర్ భ‌వేష్ మిశ్రా ఇళ్ల స్థలాల‌ను ర‌ద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయ‌డం వివాదాస్పద‌మైంది. దీంతో ల‌బ్ధిదారులైన జ‌ర్నలిస్టులు గురువారం నుంచి రిలే దీక్షలు చేప‌డుతున్నారు. కలెక్టర్ ఇచ్చిన నోటీసులను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో అఖిల పక్ష నాయ‌కుల‌ను, ప్రజా సంఘాల‌ను క‌లుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed