కదిలిన మెదిలిన అక్కడే..పేరుకే నియోజకవర్గ కేంద్రమా?

by Aamani |
కదిలిన మెదిలిన అక్కడే..పేరుకే నియోజకవర్గ కేంద్రమా?
X

దిశ,డోర్నకల్ : కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కార్యక్రమాలకు పిలుపునిచ్చిన,స్వయంగా సమావేశాలు పెట్టాలన్న నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మరిపెడ కేంద్రంగానే చేపడుతున్నట్లు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిఖ్యనిచ్చి ఆదరించిన మరిచినట్లున్నారు.కదిలిన మెదిలిన సభలు,సమావేశాలు మరిపెడ కేంద్రంగానే నిర్వహిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.చరిత్ర కలిగిన నియోజకవర్గం కేంద్రాన్ని విస్మరించడం సరైంది కాదనే వాదన వినిపిస్తోంది.అలాంటప్పుడు నియోజకవర్గ కేంద్రం పేరుకేనా అని ప్రశ్నిస్తున్నారు.ఏవైనా ప్రజా సమస్యలుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన కాంగ్రెస్ నాయకులు ఆయా ప్రాంతాలకు పరిమితమవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఈ విషయానికి బలం చేకూర్చే విధంగా భారాస పార్టీలోకి చేరికలు అధికమయ్యాయి.పార్టీ కండువ కప్పి ఆహ్వానించడంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ బిజీ అయ్యారు.ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో పర్యటనలు జరుగుతూ సమస్యల పరిష్కారం,అభివృద్ధిపై సమీక్ష సమావేశాలు చేపడుతున్నారు.మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు మాట ఇస్తున్నారు.మండల వ్యాప్తంగా చేరికలతో బీఅర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.నాయకులు ఇదేదోరని అవలంబిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed