సీఎం కేసీఆర్ ద్వారానే రాష్ట్రం సుభిక్షం.. మంత్రి ఎర్రబెల్లి

by Disha Web Desk 20 |
సీఎం కేసీఆర్ ద్వారానే రాష్ట్రం సుభిక్షం.. మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, పాలకుర్తి (కొడకండ్ల) : సీఎం కేసీఆర్ ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రత్యేక స్థానం కలిగిఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం కొడకండ్ల మండలంలోని లక్ష్మక్క పళ్లి గ్రామంలో 1 కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గౌడ కులస్తుల ఆరాధ్య దైవం అయిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేసి అనంతరం గ్రామంలో జరిగే దుర్గామాత పండగ ఉత్సవాల్లో స్థానిక ప్రజలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి పాల్గొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లక్ష్మక్క పెళ్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని మండలంలోనే గ్రామాన్ని ప్రత్యేక కూడలిగా అభివృద్ధి పరిచేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కంటే గ్రామ రూపురేఖలను మార్చామని అన్నారు. గతంలో గ్రామస్తులు పడ్డ సమస్యలను ప్రతి ఒక్కటి నెరవేర్చమని గ్రామం అభివృద్ధిలో ముందంజలో ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ రాకముందు గ్రామం ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఇంకా గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో జరిగే చెన్నూర్ రిజర్వాయర్ దేవాదుల ప్రాజెక్టు పనులను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించి పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాటయోధుడు సామాన్య కుటుంబంలో పుట్టి అతి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు శక్తి అని నిజాం పాలన పై తిరుగుబాటు చేసి ఆ పాలన పై యుద్ధం ప్రకటించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన మన ప్రాంతంలో పుట్టడం గర్వకారణం అని సర్దార్ సర్వాయి పాపన్న పేరు మీద హైదరాబాదులో ఐదు ఎకరాల భవనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పాపన్న జయంతి వర్ధంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆయన విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

గౌడ కులస్తుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వైన్స్ షాపుల్లో 15% రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గౌడ కులస్తులకు గిరిక తాటీ చేట్లను అందజేసినట్లు తెలిపారు. అనంతరం గౌడ కులస్తుల కోరిక మేరకు మంత్రి ఎర్రబెల్లి కల్లు తాగి అందరిని ఉత్తేజపరిచారు. గ్రామంలో ఏర్పాటు చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని బహుకరిస్తున్న (దాత) దేవర్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామానికి చెందిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.గ్రామస్తులు శ్రీకాంత్ గౌడ్ సన్మానించారు.

దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు

గ్రామంలో జరుగుతున్న దుర్గామాత ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.మహిళలతో కలిసి బోనం ఎత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ప్రజలతో ముచ్చటించి గ్రామంలో సందడి చేశారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రత్యేక స్థానం కలిగి ఉందని వారి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. గ్రామ ప్రజలకు దుర్గామాత పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సందర్భాన్ని బట్టి మెలిగే మంత్రి ఎర్రబెల్లి ప్రజలతో మమేకమవడంలో దిట్ట కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో పాటు వారి బాగోగులు చూసుకోవడంలో మంత్రి ఎర్రబెల్లి ఎప్పుడు ముందు ఉండడం తెలిసిన విషయమే. రామన్నగూడెంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో మంత్రి ఎర్రబెల్లి మంత్రి ఎర్రబెల్లి కాసేపు ముచ్చటించారు. స్వయంగా మంత్రి ఎర్రబెల్లి వచ్చి ఆప్యాయంగా పలకరించి వారితో మాట్లాడడంతో కూలీల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వేసవికాలం ఎండలు తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉదయం సాయంత్రం పూట పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి వారికి సూచించారు.

మొక్కజొన్న రైతులు అధైర్య పడవద్దు మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి మండలంలోని ఎఫ్ఎస్సీఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు ప్రక్రియ పూర్తయిన గాని లారీ లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు చెప్పగానే వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ దాత బబ్బురి శ్రీకాంత్ గౌడ్, స్థానిక డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీటీసీ కేలోతు సత్తెమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే రామోజీ, లక్ష్మక్క పెళ్లి సర్పంచ్ పుస్కూరి శోభ సంపత్ రావు, మండల ముఖ్య నాయకులు ఆయా గ్రామాల ప్రజాప్రతిథులు సంబంధిత శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed