ఆరు పథకాల హామీల కార్యక్రమంలో ఇనగాల

by Disha Web Desk 8 |
ఆరు పథకాల హామీల కార్యక్రమంలో ఇనగాల
X

దిశ,సంగెం: సంగెం మండలం లోని గవి చర్ల గ్రామంలో గడప గడప ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చండీగఢ్ పీసీసీ అధ్యక్షుడు హార్మోహిందర్ సింగ్ లక్కీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇనగల వెంకటరామిరెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో హార్మోహిందర్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా ప్రజలకు కచ్చితంగా హామీలను నెరవేరుస్తామని అన్నారు.ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ నిన్న హైదరాబాదులో జరిగిన విజయభేరి సభలో సోనియమ్మ ఇచ్చిన హామీలను ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి హామీలను తెలిసేలా చేయాలని మండల అధ్యక్షులను కార్యకర్తలను కోరడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను హామీలుగా కాకుండా కచ్చితంగా నెరవేరుస్తామని అన్నారు.తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇనగాల అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు యువ వికాస్ చేయూత ఈ ఆరు హామీలను కచ్చితంగా ప్రజలకు అందేలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాధవ్ రెడ్డి, ఎం పి టి సి సంపత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కేశవులు కాంగ్రెస్ నాయకులు రమేష్,వెంకటేశ్వర్లు యాకుబ్ సదానందం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed