ఆరు గ్యారంటీలు పక్క అమలు : భూపేన్ కుమార్ బోరా

by Disha Web Desk 8 |
ఆరు గ్యారంటీలు పక్క అమలు : భూపేన్ కుమార్ బోరా
X

దిశ,మరిపెడ (కురవి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగా అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ ఆదివారం తుక్కుగూడ లో నిర్వహించిన సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగానే గడపగడపకు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పథకాన్ని కురవి మండలం లింగ్యా తండా నుంచి ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్ మాలోతు నెహ్రూ నాయక్ ఆధ్వర్యంలో అస్సాం టీపీసీసీ భూపేన్ కుమార్ బోరే అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపన్ కుమార్ బోరే మాట్లాడుతూ కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి రాగానే హామీలు అమలు చేసిందని తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలని అమలు చేస్తామని సోనియా గాంధీ చెప్పిన మాటను గుర్తు చేశారు.

రాష్ట్రంలో అవినీతిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని దీనికి కారణం ఒకరికొకరు సహకరించుకోవడమేనని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.భాజపాకు భారస "బి" టీమ్ అని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లబొల్లి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు.1)మహాలక్ష్మి,2)రైతుభరోసా,3)ఇందిరమ్మఇండ్లు,4)గృహజ్యోతి,5)యువ వికాసం,6)చేయూత..ఈ ఆరు గ్యారెంటీలతో కూడిన కార్డును ప్రతి ఇంటికి పంపిణీ చెయ్యనున్నట్లు తెలిపారు.తొలుత భూపేన్ కుమార్ బోరా కు కోలాట నుత్యాలతో ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో భరత్ చందర్ రెడ్డి,మెరుగు సత్యనారాయణ,లాలు నాయక్,రఘురాం రెడ్డి, జగదీష్, ఎల్ హెచ్ పి ఎస్ పార్లమెంటరీ ఇంచార్జ్ వినోద్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు,తదితరులున్నారు.


Next Story

Most Viewed