జీడబ్ల్యూఎంసీలో అనధికార నిర్మాణాల తొలగింపు

by Dishafeatures2 |
జీడబ్ల్యూఎంసీలో అనధికార నిర్మాణాల తొలగింపు
X

దిశ, వరంగల్ టౌన్: అక్రమ నిర్మాణలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ లను కూలగొట్టారు. జిల్లా ఎన్ ఫోర్స్ మెంట్ ఆధ్వర్యంలో GWMC పరిధిలోని అక్రమ నిర్మాణులు, ప్రహారి గోడలను మంగళవారం అధికారులు తొలగించారు. గోపాల్ పూర్, లక్ష్మీనగర్ లో అక్రంగా నిర్మించిన ఓ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. అదేవిధంగా మడికొండ రామన్ హైస్కూల్ వద్ద చెరువు శిఖం భూమిని ఆక్రమించిన నిర్మించిన ప్రహారీ గోడను అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ పోర్స్ మెంట్ బృంద, బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed