ఇసుకాసురుల రాక్షసత్వం.. ఆగని అక్రమ దందా

by Dishanational2 |
ఇసుకాసురుల రాక్షసత్వం.. ఆగని అక్రమ దందా
X

దిశ, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఇసుక బకాసురులు పెద్ద మొత్తంలో తవ్వకాలు జరుపుతున్నారు. పట్టించుకోవలసిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డురం, వారికి అందవలసిన ముడుపులు వారికి అందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు అండతో అధికారుల బలంతో ఇసుకాసురులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం, రోళ్లకల్, చెరువు ముందు తండాలో పట్టా భూముల్లో చెరువులో గుంతలు ఉన్నట్టుగా, గుంతలు తీసి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పట్టణాలకు పల్లెలకు తరలిస్తూ అమ్ముకుంటున్నారు. ట్రాక్టర్లు నడిపే వ్యక్తులకు లైసెన్స్ లేకపోవడం, నంబర్ ప్లీట్స్ లేకపోవడం, వాహనాలకు కావలసిన సరైన పత్రాలు షోరూంల నుండి పొందకుండా ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇసుక రవాణా జరుపుతున్నారు. అదే కాకుండా పల్లె ప్రగతిలో భాగంగా శుభ్రంగా ఉండవలసిన రోడ్లు ఇసుకమయంగా మారి వాహన దారులకు ఇబ్బందికరంగా మారాయి. పట్టించుకోవలదిన అధికారులు ఇటు దిక్కు ఒక్క చూపు కూడా చూడటంలేదు.

అధికారులు మామూళ్లకు యూనియన్లే దిక్కు

మండలంలో ఇసుక తవ్వకాలు జరిపి గ్రామాలలో వంద ట్రాక్టర్లు ఒక యూనియన్ను ఏర్పాటు చేసి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల అంతర్యం ఏమిటోనని పలువురు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. వీరికి కావాల్సిన అధికారులు చేయూతనివ్వడం వలనే ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుందని , ఇందులో కొంత మంది ప్రజాప్రతినిధుల అంగబలం ఉందని తెలుస్తుంది.

పత్రికలో ప్రచురించిన ఆగని ఇసుక అక్రమ దందా

పత్రికలో పలుమార్లు ఇసుక అక్రమ రవాణాపై వార్తలు వచ్చినప్పటికీ అధికారుల్లో స్పందన లేకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరపడం వల్ల భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని, తద్వారా రైతులకు నష్టం వాటిల్లుతుందని పలుమార్లు రైతులు అధికారులను వేడుకున్న ప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మలుమార్లు వార్త ప్రచురించిన నుండి ఇసుక బంధు అయింది,అనుకోవడానికి తప్ప ఇంటి దగ్గర డంపింగ్ చేసిన ఇసుక ధైర్యంతో అధికారులు చూస్తూ ఉండగా ధైర్యంగా ఇసుకసురుల ఇసుకను సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

పోలీస్ మైనింగ్ , రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారుల జాడ ఎక్కడ

వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేఇకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్న అప్పటికీ అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.పట్టపగలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పావడం విడ్డురం. మట్టి నుండి ఇసుకను వేరు చేయడానికి విద్యుత్ అధికారుల అనుమతి లేకుండా వాగుల్లో వంకల్లో స్తంభాలకు వైర్లు తగిలించి స్టార్టర్లను ను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడే విధంగా విద్యుత్తును వినియోగిస్తున్నారు. ఇదంతా విద్యుత్ అధికారులకు తెలిసినప్పటికీ మామూళ్ల మత్తులో తేలి ఆడుతున్నారని పలువురు బాహటంగానే చెప్పుకుంటున్నారు.


Next Story

Most Viewed