ప్రజల కష్టం తెలిసినోడిని.. పాలకుర్తిని అభివృద్ధిని పరిచినోడిని : ఎర్రబెల్లి

by Disha Web Desk 23 |
ప్రజల కష్టం తెలిసినోడిని.. పాలకుర్తిని అభివృద్ధిని పరిచినోడిని : ఎర్రబెల్లి
X

దిశ,రాయపర్తి : గత 40 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉండి వారి కష్ట సుఖాలను తెలుసుకొని వారికి అండగా నిలబడుతూ పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచానని,మరొక్కసారి తనకు అవకాశం ఇచ్చినట్లయితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరిచి సస్యశ్యామలం చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలను కార్యకర్తలను కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని బంధన్ పల్లి కొత్తూరు పెరిక వేడు కొండాపురం ఊకల్ గట్టికల్ వెంకటేశ్వర పల్లి గ్రామాలలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పాలకుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు మన పల్లెలు ఎట్లా ఉండేవని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిపారు అన్నారు పల్లెలకు కావలసిన త్రాగు సాగునీరు కరెంటు పెట్టుబడి సాయంతో పాటు రైతు బీమా వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అన్నారు కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అబద్ధపు మాటలు మాట్లాడుతూ మళ్ళీ గద్దెనెక్కాలని చూస్తున్నారని వారి మాటలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.

50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అనిఅప్పుడు ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు అన్నారు. పాలకుర్తిలో రాష్ట్రంలో ఎగిరేది బీఆర్ఎస్ జెండా నేనని ముచ్చటగా మూడోసారి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవబోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధి కోసం గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల వలె కృషి చేయాలి అన్నారు. నాయకులు వస్తూ ఉంటారు పోతుంటారని వారు చెప్పే మాటలను నమ్మవద్దని ఎవరైతే పని చేస్తారో వారిని ఆదరించాలని అన్నారు. తాను ఎప్పుడైనా ప్రజల మనిషిని అని పార్టీలకతీతంగా తాను అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేశానని ఇక నుంచి కూడా చేస్తానని నన్ను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు జిల్లా నాయకులు గుడిపూడి గోపాలరావు గాంధీ నాయక్ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి జడ్పిటిసి రంగు కుమార్ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు మూణావత్ నరసింహ నాయక్ కార్యదర్శి పూస మధు రైతుబంధు మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్రావు మండల కో ఆప్షన్ ఆశరఫ్ నాయకులు ఎండి నయీమ్ మంద యాకోబు రెడ్డి కాంచనపల్లి వనజ రాణి వేముల రమేష్ సతీష్ సంతోష్ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Next Story