మొదటిసారిగా ఎంజీఎం ఆసుపత్రిలో గుండె బైపాస్ సర్జరీ

by Dishanational1 |
మొదటిసారిగా ఎంజీఎం ఆసుపత్రిలో గుండె బైపాస్ సర్జరీ
X

దిశ, ఎంజీఎం సెంటర్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వి. చంద్రశేఖర్, కె. ఎం. సి. ప్రిన్సిపాల్ డా. డి.మోహన్ దాస్, పి. ఎం. ఎస్. ఎస్. వై. హృద్రోగ శస్త్ర చికిత్స విభాగాధిపతి డా. గోపాలరావ్ ఆధ్వర్యంలో బుధవారం ఇంట్రా కార్డియక్ రిపేర్ ఎ.ఎస్.డిని హృదయ శస్త్రచికిత్స నిపుణులు డా. జె. సృజన్, డా. బి. రిషిత్ నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సలో అనస్తీషియా విభాగాధిపతి డా. కె. నాగార్జునరెడ్డి ప్రొ. డా.జి. శ్రవణ్ కుమార్, అసోసియేట్ ప్రొ. డా. బి.చంద్రశేఖర్, డా. స్పూర్తి, డా. ప్రవళ్లిక పాల్గొన్నారు.

అనంతరం ఎంజీఎం సూపరింటెండెంట్ డా. వి.చంద్రశేఖర్ మాట్లాడుతూ... శస్త్ర చికిత్స విజయవంతమైనది, ఎంజీఎం చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తదని అన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రక్రియ, హర్ట్ లంగ్ బైపాస్ యంత్రము ద్వారా 29 నిమిషాల పాటు హృదయ స్పందనను నిలిపివేసి ఎ.ఎస్.డి పెరికార్డియల్ ప్యాచీ ప్రక్రియ ద్వారా సరి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పెద్ద సర్జరీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరగటం ఇదే మొదటిసారి అని తద్వారా సి.ఎ.బి.జి గుండె బైపాస్ శస్త్ర చికిత్సలు చేయగలిగే సామర్థ్యం ఎంజీఎం ఆసుపత్రిలో మెరుగు పరుచుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, సి.ఎస్ అర్.ఎమ్.ఓ డా. మురళి, పి.ఎం.ఎస్.ఎస్.వై ఆర్.ఎం.ఓలు డా.హీన సుల్మాజ్, డా. రహియా, నర్సింగ్ సూపరింటెండెంట్ సుశీల, తదితర సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed