గీసుగొండ మండలంలో వడగండ్ల వాన బీభత్సం

by Disha Web Desk 12 |
గీసుగొండ మండలంలో వడగండ్ల వాన బీభత్సం
X

దిశ, గీసుగొండ: వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలంలో శనివారం రాత్రి బలమైన ఈదురు గాలులతో సుమారు గంట పాటు కురిసింది. అకాల వడగండ్ల వర్షానికి మండలంలోని మొగిలిచర్ల, గీసుకొండ, మనుగొండ, మచ్చాపూర్, ఎల్కుర్తి, ఆరెపల్లి, చింతలపల్లి, పోతురాజు పల్లి, గొర్రె కుంట గ్రామాలతో సహా వివిధ గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న, టమాట, మిర్చి, కూరగాయ పంటలు వడగండ్ల వాన బీభత్సానికి ధ్వంసం అయ్యాయి.

చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కాగా ఈ వడగండ్ల వాన బీభత్సానికి గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన కందుల మొగిలి, ముక్కెర రాజు రైతులకు చెందిన నాలుగు ఎకరాల మిర్చి తోటలు ధ్వంసమయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి అందే సమయానికి నేలపాలయ్యాయి. దీంతో సుమారు 8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు రైతులు రోదిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed