ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల పోలింగ్.. దుగ్గొండిలో 73 శాతం పోలింగ్ నమోదు

by Aamani |
ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల పోలింగ్.. దుగ్గొండిలో 73 శాతం పోలింగ్ నమోదు
X

దిశ, దుగ్గొండి: నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికల్లో దుగ్గొండి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రానికి చివరి నిమిషంలో ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓటరుకు గేటు వద్ద ఉన్న అధికారులు ఇప్పటికే పోలింగ్ సమయం అయిపోయింది అనుమతించడానికి వీలు లేదు అని చెప్పారు. దీంతో ఓటరు ఒక్క అవకాశం ఇవ్వండి రెండు నిమిషాలే కదా లేటు అయిందని అధికారులను ప్రాధేయపడ్డారు. అక్కడే ఉన్న దుగ్గొండి ఎస్సై పరమేష్ ఓటు వేసే సమయం పూర్తయిన తర్వాత లోపలికి అనుమతించడం కుదరదని పట్టబద్రుడికి నచ్చజెప్పి పంపించేశారు. దీంతో చేసేదేం లేక వెను తిరిగి వెళ్లారు.

మండల వ్యాప్తంగా పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. స్థానిక తహసిల్దార్ రవిచంద్ర రెడ్డి, ఎన్నికల అధికారులు, దుగ్గొండి సీఐ రాజగోపాల్ సారథ్యంలో ఎస్సై పరమవారి సిబ్బందితో బందోబస్తు విధులు నిర్వహించారు. దుగ్గొండిలో 73 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో మొత్తం 2242 ఓట్లు ఉండగా 1636 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ బూత్ నెంబర్ 157 లో 1099 ఓట్లకు గాను 817 ఓట్లు పోలవగా, బూత్ నెంబర్ 158 లో 1143 గాను 819 ఓట్లు పోలయ్యాయి.

Next Story

Most Viewed