- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరుప్పుల మండల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.

దిశ, పాలకుర్తి : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పేర్కొన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరుప్పుల మండల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సమస్యలు, రైతుల ఇబ్బందులు వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రతి గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.దేవరుప్పుల మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, గ్రామస్థాయిలో కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నాయకులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో దేవరుప్పుల మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఇతర నాయకులు పాల్గొన్నారు.






