KCR ఉద్యోగం ఊడగొడితే.. జాబ్‌లు మీ ఇంటికే వస్తాయ్: గండ్ర సత్యనారాయణ

by Disha Web Desk 19 |
KCR ఉద్యోగం ఊడగొడితే.. జాబ్‌లు మీ ఇంటికే వస్తాయ్: గండ్ర సత్యనారాయణ
X

దిశ, శాయంపేట: తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన యువత స్వరాష్ట్రంలో వంచనకు గురవుతున్నారని.. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సత్యనారాయణ రావు విమర్శించారు. శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థుల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

ఉద్యోగాల ప్రకటనల పేరుతో యువతను సీఎం మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఇక కేసీఆర్‌ను అడగవద్దని, కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయని నిరుద్యోగులను ఉద్దేశించి గంట సత్యనారాయణ రావు పేర్కొన్నారు. నోటిఫికేషన్ అని చెప్పగానే తల్లిదండ్రులు కూలీనాలి చేసి సంపాదించిన డబ్బులను కోచింగ్ సెంటర్లకు ధారపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామని, చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేని వారి అభివృద్ధిని తోడ్పాటును అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.


Next Story

Most Viewed